: మా డిమాండ్లను పరిశీలిస్తేనే విభజన బిల్లుకు మద్దతు: జేడీ శీలం
మా డిమాండ్లను పరిశీలిస్తేనే విభజన బిల్లుకు మద్దతు తెలుపుతామని సీమాంధ్ర కేంద్ర మంత్రి జేడీ శీలం స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల క్రితమే మా డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని... కానీ, అప్పుడు మా విన్నపాలను ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. మా మాట లెక్కచేయలేదన్న విషయాన్ని నిన్న జీవోఎంకు గట్టిగా చెప్పామని అన్నారు. ఇప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే టీబిల్లుకు మోక్షం లభించదని జేడీ శీలం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకుందని తెలిపారు.