: కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన సబ్బం హరి
కేంద్ర ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వ్యూహాత్మకంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తున్నారు. నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ నోటీసు ఇవ్వగా... ఈ రోజు సబ్బం హరి నోటీసు ఇచ్చారు. ప్రతిరోజు ఒక సభ్యుడు అవిశ్వాస నోటీసు ఇవ్వాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సబ్బం హరి మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాలను ఎట్టి పరిస్థితుల్లో జరగనీయమని తెలిపారు. ఈ సమావేశాల్లో అనేక బిల్లులు సభ ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని... సభ జరగకపోతే విపక్షాలు ఒత్తిడి చేస్తాయని... ఈ నేపథ్యంలో, టీబిల్లు పక్కకు వెళ్లిపోతుందని చెప్పారు.