: ఆ కుక్క యజమాని కారునే కరకర కొరికేసింది!


శునకానికి విశ్వాసం ఎక్కువనుకుంటాం. కానీ, బ్రిటన్ లో ఒక శునకం మాత్రం యజమాని కంట కన్నీరు పెట్టించింది. 80లక్షల రూపాయల ఖరీదైన ఆస్టాన్ మార్టిన్ కారును ముచ్చటపడి కొనుక్కున్నాడు బ్రిటన్ లోని సోమర్ సెట్ కు చెందిన రాయ్ స్టన్ గ్రిమ్ స్టెడ్. గత వారం బయటి నుంచి ఇంటికి వచ్చి చూసిన ఆయనకు మతిపోయినంత పనైంది. తన కారు ముందు చక్రం పై భాగంలో ఉండే ఫైబర్ గ్లాస్ చిన్న చిన్న ముక్కలై కనిపించాయి.

ఈ ఘనకార్యం తన పెంపుడు శునకం ల్యూస్ పనిగా అర్థం చేసుకున్నాడు. కొంచెం కూడా ఆలస్యం చేయలేదు. ఇది ఇక్కడే ఉంటే ఇంకేమి కొరికేస్తుందో? అన్న భయంతో దాన్ని తీసుకెళ్లి వేరొకరి చేతిలో పెట్టి ఇంటికి వచ్చేశాడు. కానీ, ఆ శునకం చేసిన పనిని మాత్రం వారికి చెప్పలేదు. చెబితే తీసుకోరనే భయం. ఒకవేళ వారంతట వారే తెలుసుకుంటే అప్పుడు చూద్దాంలేనని గ్రిమ్ స్టెడ్ తనకు తాను సర్ధి చెప్పుకున్నాడు. చివరిగా.. దురదృష్టంలోనూ అదృష్టం ఏమిటంటే ఆ కారుకు బీమా ఉంది. పరిహారం కింద మూడు లక్షల రూపాయలు గ్రిమ్ స్టెడ్ కు అందనున్నాయి.

  • Loading...

More Telugu News