: జీవోఎం భేటీకి హాజరుకాని పురంధేశ్వరి, పనబాక
కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రులు షిండే, చిదంబరం, జైరాం రమేష్, నారాయణస్వామితో సీమాంధ్ర కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి మౌనదీక్షతో దిగి వచ్చిన జీవోఎం సీమాంధ్రుల సమస్యలపై దృష్టి సారించింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు గతంలో సూచించిన పది అంశాల సాధ్యాసాధ్యాలపై వారితో చర్చిస్తున్నారు. కాగా ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, పనబాక లక్ష్మిలు గైర్హాజరయ్యారు. వీరు మినహా మిగిలిన సీమాంధ్ర కేంద్ర మంత్రులంతా జీవోఎం భేటీకి హాజరయ్యారు.