: వీడియో రూపంలో మీ ఫేస్ బుక్ చరిత్ర


ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ మంగళవారంతో పదేళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేందుకు ఫేస్ బుక్ యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుంది. తాజాగా, నిమిషం నిడివి గల వీడియో సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. 62 సెకన్ల ఈ క్లిప్ లో మీరు ఫేస్ బుక్ లోకి ఎప్పుడు ఎంటరయ్యారు, మీరు లైక్ చేసిన పోస్టింగ్స్, మీ వ్యక్తిగత పోస్టింగ్స్ వంటి వివరాలు పొందుపరిచారు. మంగళవారం నుంచే ఈ సదుపాయాన్ని ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది. ఇంకెందుకాలస్యం... మీ ఫేస్ బుక్ హిస్టరీని వీడియో రూపంలో వీక్షించాలనుకుంటున్నారా.. వెంటనే Facebook/lookback లో లాగిన్ అయితే సరి.

  • Loading...

More Telugu News