: మన రోగ నిరోధక వ్యవస్థ కూడా ఓవర్ టైమ్ పనిచేస్తుందట!
కొన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు నిర్దేశిత పనిని పూర్తి చేసేందుకు ఓవర్ టైమ్ పనిచేయడం తెలిసిందే. సరిగ్గా మానవుని రోగ నిరోధక వ్యవస్థ కూడా ఇలాగే పనిచేస్తుందట. శరీరంలో ఏవైనా క్యాన్సర్ కారక కణాలు ఉత్పన్నమవుతున్నాయేమో అన్న విషయాన్ని కనుగొనేందుకు అహర్నిశలు శ్రమిస్తూ, వాటిని రూపుమాపే క్రమంలో రోగ నిరోధక వ్యవస్థ ఓవర్ టైమ్ పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇన్ స్టిట్యూట్ ఈ వివరాలు తెలిపింది. మన రోగ నిరోధక వ్యవస్థ (టి-సెల్స్) అప్రమత్తంగా ఉంటూ క్యాన్సర్ కారక బి-ఇమ్యూన్ కణాలు ప్రమాదకర బి-సెల్ లింఫోమాస్ దశకు మారకముందే మొగ్గ దశలోనే తుంచి వేస్తుందని పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ అలెక్స్ కెల్లీస్ తెలిపారు. ఏవో కొన్ని సందర్భాల్లోనే రోగ నిరోధక వ్యవస్థ విఫలం కావడంతో క్యాన్సర్ సోకుతుందని కెల్లీస్ పేర్కొన్నారు.