: ఉభయసభలు తిరస్కరించిన బిల్లును పార్లమెంటుకు పంపకండి: రాష్ట్రపతిని కోరిన సీఎం
రాష్ట్రపతితో ముఖ్యమంత్రి కిరణ్ భేటీ ముగిసింది. ఆయనతో పాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స, పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 75 నుంచి 80 శాతం ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని... అందువల్ల రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని రాష్ట్రపతిని కోరినట్టు చెప్పారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరామని తెలిపారు. విభజన జరిగితే ఇరు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పామన్నారు. శాసనసభ, శాసనమండలిలు ఏకగ్రీవంగా తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టరాదని విన్నవించామని చెప్పారు. గతంలో ఏ శాసనసభ, శాసనమండలి విభజన బిల్లును తిరస్కరించలేదని... దేశ చరిత్రలోనే ఇలాంటిది ఎన్నడూ జరగలేదని రాష్ట్రపతికి తెలిపామన్నారు. ప్రజాభిప్రాయం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విన్నవించామన్నారు. ఆర్టికల్-3 ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉందని ముఖ్యమంత్రి కిరణ్ చెప్పారు.