: ప్రభుత్వ రంగాల వైఫల్యతవల్లే ప్రయివేటు ప్రాజెక్టులు : ధర్మాన


రాష్ట్రంలో ప్రయివేటు రంగంలో ప్రాజెక్టులు పుట్టుకొస్తుండడం, ప్రభుత్వం వారికే అనుమతులు ఇస్తుండడంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తనదైన శైలిలో మాట్లాడారు. నాలుగు దశాబ్దాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు విఫలం అయినందునే ప్రైవేటీకరణకు ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఆయన మాట్లాడారు. 

ప్రజల అభివృద్ధికోసమే ప్రాజెక్టులు రావాలంటున్నాననీ, అంతేకానీ వాటిలో తనకేదో వాటాలు ఉండి మాత్రం కాదనీ అన్నారు. ప్రయివేటు ప్రాజెక్టుల వల్ల మరింత మందికి ఉపాధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి  మే మొదటి వారంలోపు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు.

  • Loading...

More Telugu News