: ముద్దు పెట్టినోడికి తగిన శాస్తి!


ముద్దుకు తగినశాస్తి చేసిందో యువతి. బలవంతంగా ముద్దు పెట్టుకోబోయిన ఓ వ్యక్తి నాలుక కొరికేసి బాగా బుద్ధి చెప్పింది. మధ్యప్రదేశ్ లోని మోరెనా జిల్లా కమలానగర్ కు చెందిన ఓ యువతిని కమలేష్(30) అనే వ్యక్తి వారం రోజులుగా వేధిస్తున్నాడు. నిన్న కోట్రా సుల్తానాబాద్ ప్రాంతంలో ఇన్ కంటాక్స్ కాలనీలో ఆ యువతిని అందరి ముందు కమలేష్ ముద్దు పెట్టేసుకున్నాడు. ముందు షాక్ కు గురైన ఆ యువతి తేరుకుని అతడి నాలుకను కొరికేసింది. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కమలేష్ ను సెక్షన్ 354 కింద అరెస్టు చేశారు. అయితే ఆ యువతి తనకు నాలుగేళ్లుగా తెలుసని, తాను ఆమెకు కొంత సొమ్ము అప్పుగా ఇచ్చానని చెబుతున్నాడు. 'అప్పిచ్చినంత మాత్రాన ముద్దు పెట్టేసుకుంటావా?' అంటూ పోలీసులు మనోడికి 'పోలీస్ సత్కారం' కూడా చేసి, రిమాండుకు తరలించారు.

  • Loading...

More Telugu News