: మత ఘర్షణల్లో యూపీ నెంబర్ వన్
2013వ సంవత్సరంలో మతఘర్షణల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానిదే అగ్రస్థానమని రాజ్యసభ స్పష్టం చేసింది. మత హింస నిరోధక బిల్లుపై చర్చ సందర్భంగా ఈ అంశం సభ దృష్టికి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో 365 రోజుల్లో 247 సార్లు ఘర్షణలు చెలరేగగా, 77 మంది ప్రాణాలు కోల్పోయారని.. రెండో స్థానంలో మహారాష్ట్ర నిలిచిందని తెలిపింది. అక్కడ 88 సార్లు మత ఘర్షణలు చెలరేగగా, ఇందులో 12 మంది మృత్యువాత పడ్డారని.. మధ్యప్రదేశ్ లో 84, కర్ణాటకలో 73, గుజరాత్ లో 63 సార్లు మత ఘర్షణలు చెలరేగాయని వెల్లడించింది.