: ఆమ్ ఆద్మీ విదేశీ నిధులపై వివరణ కోరిన ఢిల్లీ హైకోర్టు


ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా స్వీకరించిన విదేశీ నిధులపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగు రోజుల్లోగా తమ సమాధానాలను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. పలు చట్టాలను ఉల్లంఘిస్తూ కొత్తగా ఏర్పాటయిన ఏఏపీ నిధులను స్వీకరించిందని, ఈ మేరకు వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కొన్ని రోజుల కిందట న్యాయస్థానంలో ఓ పిల్ దాఖలైంది. దానిపై ఈ రోజు విచారణ చేపట్టగా ఏఏపీ తరపున ప్రశాంత్ భూషణ్ హాజరయ్యారు. అనంతరం విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News