: సీఎంపై నిప్పులు చెరిగిన ఉపముఖ్యముంత్రి
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌనదీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ నిప్పులు చెరిగారు. కిరణ్ కు నైతిక విలువలుంటే రాజీనామా చేయాలని అన్నారు. ఆయన ప్రవర్తన అవహేళనకరంగా ఉందని విమర్శించారు. కుట్రలకు, కుతంత్రాలకు పర్యాయపదం సీఎం అని దుయ్యబట్టారు. ఆయన తీరును ఖండిస్తున్నామని, రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి ఒక ప్రాంతానికి అనుకూలంగా దీక్ష చేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని స్పష్టం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆగదని ధీమాగా చెప్పారు. తెలంగాణ ప్రక్రియ మొదలైందని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టడం ఖాయమని ఉద్ఘాటించారు.