: అధిష్ఠానాన్ని ధిక్కరిస్తాం: హర్షకుమార్
అధిష్ఠానం తమను వార్ రూం సమావేశానికి పిలిచి తమ ఆజ్ఞను శిరసావహించాలని, తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని ఆదేశించిందని ఎంపీ హర్షకుమార్ తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌనదీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలా? అధిష్ఠానమా? అనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైతే, తాము ప్రజలవైపే మొగ్గుచూపుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో ప్రజలతో పాటే తాము నడుస్తామని అన్నారు. అందుకోసం అధిష్ఠానాన్ని ధిక్కరించేందుకు కూడా వెనుకాడడం లేదని ఆయన తెలిపారు. ఇప్పుడు దీక్ష చేయడమంటే అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించడమేనని ఆయన చెప్పారు.