: సీఎం మౌన దీక్ష రాజకీయ డ్రామా: కిషన్ రెడ్డి


ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన దీక్షపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన దీక్ష ఓ రాజకీయ డ్రామా అని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో తమ పబ్బం గడుపుకునేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సోనియాగాంధీ తలచుకుంటే సీఎం పదవి నుంచి కిరణ్ ను తొలగించే అవకాశం ఉందని... కానీ, అలా చేయకుండా కిరణ్ చేత ఆడిస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News