: సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా ముందుకెళ్తాం: టి-కాంగ్రెస్ ఎంపీలు


తెలంగాణ సాకారం చేసుకునే క్రమంలో సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా ముందుకెళతామని టి-కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నారు. పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు పాస్ అవుతుందన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, సీఎం దీక్ష అభ్యంతరకరం అని అభిప్రాయపడ్డారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే పదవికి రాజీనామా చేసి ఉద్యమం చేయాలని వారు సూచించారు. మీడియాతో మాట్లాడిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజయ్య తదితరులున్నారు. నాయకత్వ లక్షణాలు లేని కిరణ్ ను సీఎంను చేస్తే.. ఆయన కాంగ్రెస్ కు సోనియాకు ద్రోహం చేస్తున్నాడని కోమటిరెడ్డి విమర్శించారు.

  • Loading...

More Telugu News