: కేంద్రం తీరు చట్టవిరుద్ధం.. రాజ్యాంగ విరుద్ధం: గాదె


కేంద్ర ప్రభుత్వం తీరు చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌనదీక్షలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ వ్యతిరేకిస్తున్నా కేంద్రం విభజన అంటోందని మండిపడ్డారు. సంప్రదాయాలకు విరుద్ధంగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, మెజారిటీ ప్రజా ప్రయోజనాలను కాలరాస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాల్లో నడుస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News