: రాజ్యాంగ విరుద్ధం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: రామచంద్రయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌనదీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీరు ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందని అన్నారు. శాసనసభ, శాసనమండలి తిరస్కరించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకూడదని ఆయన తెలిపారు. అయినప్పటికీ తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని చెప్పడం అరాచకమేనని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు.