: ఏ భాషలో చెబితే అర్థం అవుతుంది: ఏరాసు
కేంద్రానికి ఏ భాషలో చెబితే అర్థం అవుతుందని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన మాట్లాడుతూ, కేంద్రానికి 87 మంది శాసనసభ సభ్యులు 9 వేలకు పైగా అభ్యంతరాలు చెబితే, కనీసం వాటిని చదవకుండా రాష్ట్ర విభజన చేస్తామని చెప్పడం ఎంత వరకు సముచితమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన రాష్ట్ర విభజన చేపడుతోందో కనీసం వారికి కూడా అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. వినతులిచ్చాం, విజ్ఞప్తులు చేశాం, ప్రశ్నించాం ఇప్పడు దీక్ష చేస్తున్నాం. ఏం చేస్తే కేంద్రానికి వాస్తవాలు అర్థం అవుతాయో తమకు తెలియడం లేదని ఆయన అధిష్ఠానం తీరుపై మండిపడ్డారు.