: రాజకీయ లబ్ది కోసమే బిల్లు: చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును తెచ్చారని మండిపడ్డారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను ముంబయిలో కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని అన్నారు. ఒప్పందం ప్రకారమే జగన్ కు బెయిల్ ఇచ్చారని, ఎన్నికల తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తాడని ఆరోపించారు. ఇక థాక్రే మాట్లాడుతూ, పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ బిల్లు తెచ్చిందని అన్నారు. విభజనపై కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు సరిగా లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News