: సాక్షాత్తు ముఖ్యమంత్రే రోడ్డెక్కారు.. ప్రజల ఆకాంక్షలు తెలుసుకోండి: గంటా
సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డెక్కాల్సిన పరిస్థితి తలెత్తిందంటే.. మెజారిటీ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌనదీక్షలో ఆయన మాట్లాడుతూ, విభజన ఎవరికీ మంచిది కాదని ముఖ్యమంత్రి లెక్కలతో వివరించారని అన్నారు. విభజనకు ప్రాతిపదిక లేనప్పుడు విభజించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మనోభావాలు అనే వాదన మొదలైతే ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక వాదాలు మొదలవుతాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధిష్ఠానం వాస్తవాలు గ్రహించాలని ఆయన సూచించారు.