: కళ్లు తెరవండి.. ప్రజల కంటే ప్రభుత్వాలు గొప్పవి కాదు: శైలజానాథ్


కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇప్పటికైనా కళ్లు తెరవాలని మంత్రి శైలజానాథ్ సూచించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌనదీక్షలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల కంటే ప్రభుత్వాలు గొప్పవి కాదని అన్నారు. తాము కాంగ్రెస్ వాదులమైనప్పటికీ ఎందుకిలా ధర్నాకు దిగాల్సి వచ్చిందో అధిష్ఠానం అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. విభజన ఎవరికీ మంచిది కాదని, నేతల్లో విస్తృత భావాలు ఉండాలని, సమున్నత ఆశయాలు, ప్రజా ప్రయోజనాలు ఆశించి పని చేయాలని ఆయన సూచించారు. వేర్పాటువాదం ప్రజలకే కాకుండా దేశానికి కూడా చేటు తెస్తుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News