: సమైక్యంలో జగన్ ప్రత్యేక తోడేలు: ఆనం వివేకా
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సమైక్య ముసుగులో ప్రత్యేక తోడేలు జగన్ అని అన్నారు. సమైక్యవాదంలో ఆయన ఏర్పాటువాదిగా ఉన్నారన్నారు. నాలుగు నెలల్లో తాను కాబోయే సీఎం అంటే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదన్నారు. అధిష్ఠానం మీద తిరుగుబాటు చేసిన ముఖ్యమంత్రే అసలైన సమైక్యవాది అని వివేకా అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో చతికిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు.