: బాబుకు హామీ ఇచ్చిన శివసేన అధినేత
చంద్రబాబు తన రాజకీయ చతురతను చాటుకుంటున్నారు! కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును అడ్డుకునే క్రమంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతూ ముందుకు వెళుతున్నారు. ఈ ఉదయం ముంబయి వెళ్ళి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేని కలిసి బిల్లుకు మద్దతివ్వొద్దని కోరిన బాబు అనుకున్నది సాధించారు. థాక్రేను కాంగ్రెస్ పైకి ఉసిగొల్పడంలో కృతకృత్యులయ్యారు. చంద్రబాబు తనను కలిసిన అనంతరం థాక్రే మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ విభజించు పాలించు రీతిలో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తాము బిల్లును వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు.