: వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్ సభ
వాయిదా అనంతరం లోక్ సభ ప్రారంభమైంది. సభా ప్రారంభంలో సీమాంధ్ర సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చారని, అయితే సభ ఆర్డర్ లో లేనందును తీర్మానాన్ని ఇప్పుడే తీసుకోలేమని స్పీకర్ మీరా కుమార్ తెలిపారు. మరో వైపు సభ ప్రారంభం నుంచి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు.