: ఇక్కడికొచ్చి మేం కలిసున్నాం.. అలాంటప్పుడు రాష్ట్రం ఎందుకు విడిపోవాలి?: ఢిల్లీ తెలుగువారి స్పందన


ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చిన తాము తెలుగు వారమనే భావనతో కలిసే ఉంటున్నామని, అలాంటప్పుడు రాష్ట్రాన్ని ఎందుకు విభజించాలని ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రజలు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మౌనదీక్ష సందర్భంగా ఆయనకు సంఘీభావం తెలిపేందుకు పలువురు స్థానికులు దీక్షాస్థలికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బయటి ప్రాంతాల్లో ఉన్న తమకు ప్రాంతీయ బేధాలు లేవని తెలిపారు. ముఖ్యమంత్రి దీక్షకు మద్దతు తెలిపేందుకు పలువురు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా రావడం విశేషం. తెలుగు ప్రజలంతా ఏకతాటిపై ఒకే రాష్ట్రంగా ఉండడమే సముచితమని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News