: అబూ సలేం రైల్లో పెళ్ళి వ్యవహారంపై విచారణకు ఆదేశించిన టాడా కోర్టు


అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం ఓ కేసు ట్రయల్ కోసం లక్నో వెళుతూ రైల్లో ఓ యువతిని వివాహం చేసుకున్న ఘటనపై టాడా కోర్టు విచారణకు ఆదేశించింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి కోర్టు అనుమతి లేకుండా ఎలా పెళ్ళాడతాడని మహారాష్ట్రలోని టాడా కోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని థానే పోలీస్ కమిషనర్ ను కోర్టు ఆదేశించింది. పది రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని స్పెషల్ జడ్జి సనాప్ కోరారు. గత నెల 8న ఓ కేసులో విచారణ నిమిత్తం సలేంను ముంబయి నుంచి లక్నో తీసుకువెళుతుండగా ఓ యువతిని నిఖా చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News