: మహిళా మంత్రులని కూడా చూడకుండా సీఎం మమ్మల్ని నెట్టేయించారు: గీతారెడ్డి
ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏపీ భవన్ నుంచి రాజ్ ఘాట్ కు బయల్దేరిన సమయంలో టీమంత్రులు, నేతలను పోలీసులు పక్కకు లాగి పడేశారు. ఈ సందర్భంగా మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ, మహిళా మంత్రులు అని కూడా చూడకుండా సీఎం కిరణ్ మమ్మల్ని పక్కకు లాగేయించారని ఆరోపించారు. రెండు సార్లు అవిశ్వాసం నుంచి గట్టెక్కించిన తమపై ఇలా ప్రవర్తించడం ఘోరమని చెప్పారు.