: మన బాలీవుడ్ చైన్ స్మోకర్స్ వీరే...!
రణబీర్ కపూర్ కు సిగరెట్ లేకపోతే మనసు మనసులో ఉండదు. తరచుగా ఆయన వాటిని ఊది పారేయాల్సిందే. ఈ చెడ్డ అలవాటును విడవలేకున్నాడు. బహిరంగ ప్రదేశంలో పొగతాగడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఇతడిపై రాజస్థాన్ లో కేసు కూడా నమోదైంది. ఇక మున్నాభాయ్ సంజయ్ దత్ కూడా చైన్ స్మోకరే. ఆయన దానికి బానిస.
అజయ్ దేవ్ గణ్ కూడా ఎంతగా ప్రయత్నించినా సిగరెట్ పీకను వదల్లేకపోయాడు. ఆయన కూతురు నైసా అయితే తండ్రితో సిగరెట్ మాన్పించాలని ఎన్నోసార్లు ప్రయత్నించిందట. అయినా లాభం సున్నా. ఈయన కూడా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కినవారే. ఇక షారూక్ గురించి చెప్పే పనేముంది? సిగరెట్ వదల్లేక.. సినిమాల్లోనూ తాగుతూ ఎన్నో సమస్యలో చిక్కుకున్నారు. అయినా సిగరెట్ తో తెంపుకునే బంధం కాదు ఆయనది! సల్మాన్ ఖాన్ కూడా చైన్ స్మోకరే కాకపోతే, ఇటీవల మానసిక వ్యాధికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆయన పొగకు దూరంగా ఉన్నారు.