: కోర్టులో లొంగిపోయిన బండ్ల గణేశ్
బాద్ షా చిత్ర ఆడియో వేడుక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక అభిమాని మరణించిన కేసులో నిర్మాత బండ్ల గణేశ్ కోర్టులో లొంగిపోయారు. ఈయన తోపాటు ఆడియో వేడుక నిర్వాహకుడు కూడా కోర్టు ముందు లొంగిపోయారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఆడియో వేడుకకు అసంఖ్యాకంగా అభిమానులు తరలి వచ్చారు.
అందరూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. దీంతో రాజ్ అనే అభిమాని ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రాయదుర్గం పోలీసులు గణేశ్ తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే వీరు కోర్టులో లొంగిపోయారు.

అభిమాని ప్రాణాలు కోల్పోవడంపై ఆడియో వేడుక నుంచే ఎన్టీఆర్, బండ్ల గణేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అందులో భాగంగానే ఎన్టీఆర్, గణేశ్ చెరో ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని రాజు కుటుంబానికి అందించారు.
- Loading...
More Telugu News
- Loading...