: ప్రారంభమైన షర్మిల ప్రజాప్రస్థానం
మోకాలు శస్త్ర చికిత్స అనంతరం, రెండు నెలల విరామం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ’మరో ప్రజాప్రస్థానం‘ యాత్ర నేటినుంచి ప్రారంభమైంది. హైదరాబాదులోని లోటస్ పాండ్ నివాసం నుంచి కుటుంబసభ్యుల సమక్షంలో యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరై షర్మిలకు మద్దతు తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ ఎస్ఎస్ఆర్ గార్డెన్స్ నుంచి షర్మిల ప్రజా ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నారు. సుమారు 15 కిలోమీటర్లకు పైగా నేటి యాత్ర సాగనుంది. గత డిసెంబరులో మోకాలికి గాయం కారణంగా యాత్ర ఆగిపోయింది.