: జై సమైక్యాంధ్ర నినాదాలతో జంతర్ మంతర్ కు బయల్దేరిన సీఎం కిరణ్
ఒక్క రోజు మౌన దీక్షకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జంతర్ మంతర్ కు బయల్దేరారు. ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి రాజ్ ఘాట్ కు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ జాతిపిత గాంధీ మహాత్మునికి నివాళులర్పించి నేరుగా జంతర్ మంతర్ కు బయల్దేరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంట సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. రాజ్ ఘాట్ లో బస్సెక్కిన ముఖ్యమంత్రి జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.