: విభజన ఆగేట్టు లేదు.. కాంగ్రెస్ కు నూకలు చెల్లిపోయాయి: జేసీ
రాష్ట్ర విభజన ఆగేలా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఆగినా, ఆగకున్నా చివరి వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రయత్నాలతో కాంగ్రెస్ అధిష్ఠానానికి జ్ఞానోదయం అవుతుందన్న విశ్వాసం తమకు ఉందని అన్నారు. విభజన జరిగితే సీమాంధ్రలో కాంగ్రెస్ కు నూకలు చెల్లిపోయినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన పేరిట ఏర్పాటు చేసిన కమిటీలన్నీ కాలయాపనకేనని స్పష్టం చేశారు. శ్రీకృష్ణ కమిటీ, ఆంటోనీ కమిటీ, జీవోఎం వల్ల ప్రజాధనం వృథా తప్ప మరేమీ ఒరగలేదని ఆయన మండిపడ్డారు. న్యాయపరంగా, లేక బీజేపీ కారణంగా విభజన ఆగితే ఆగుతుందే కానీ, మరో కారణంగా విభజన ఆగేట్టు లేదని ఆయన వెల్లడించారు.