: యమహా నుంచి ఆల్ఫా స్కూటర్
రెండేళ్ల విరామానంతరం యమహా మోటార్ ఇండియా దేశంలో ఆల్ఫా పేరుతో మరో స్కూటర్ ను విడుదల చేసింది. దీని ధర ఢిల్లీలో రూ. 49,518. రెండేళ్ల క్రితం యమహా తొలి స్కూటర్ రే ను భారత్ లో ప్రవేశపెట్టింది. అల్ఫాను ప్రధానంగా మహిళా కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని యమహా అభివృద్ధి చేసింది. ఇది హోండా యాక్టివాకు పోటీనివ్వగలదని భావిస్తోంది. 113సీసీ 4 స్ట్రోక్ ఇంజన్ గల ఇది లీటర్ పెట్రోల్ కు 62 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని యమహా చెబుతోంది.