: కేజ్రీ ప్రభుత్వాన్ని పడగొడతా: ఎమ్మెల్యే బిన్నీ
ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే బిన్నీ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఏఏపీ ప్రభుత్వాన్ని పడగొడతానని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే విషయమై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ కూడా రాస్తానని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం విశ్వాస తీర్మానం నెగ్గిన ఏఏపీకి మరో నాలుగు నెలల వరకు ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే, విశ్వాసం పొందిన తర్వాత మరో ఆరు నెలల వరకు మరో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు.