: విదేశీ పర్యాటకులకు పూర్తి రక్షణ: మధ్యప్రదేశ్ సీఎం
ఇక నుంచి మధ్యప్రదేశ్ ను సందర్శించే విదేశీ పర్యాటకులకు మరింత రక్షణ కల్పిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పర్యాటకుల ప్రయాణ, సంరక్షణ బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు. స్విట్జర్లాండ్ మహిళపై అత్యాచారం జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలను తీసుకుంటామని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం భర్తతో కలిసి మధ్యప్రదేశ్ నుంచి ఆగ్రాకు సైకిల్ యాత్రగా వెళుతున్న స్విట్జర్లాండ్ మహిళపై దాతియా జిల్లాలో ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారం జరిపిన సంగతి తెలిసిందే.