: ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం ప్రకటించిన వెంటనే స్పీకర్ మీరా కుమార్ ప్రశ్నోత్తరాల చర్చను చేపట్టారు. అటు వెంటనే పలు సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ విపక్షాలు నినాదాలు మొదలుపెట్టాయి. అటు సీమాంధ్ర, తెలంగాణ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వెల్ ల్లోకి వెళ్లడంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు రాజ్యసభ కూడా 12 గంటల వరకు వాయిదా పడింది. విపక్ష సభ్యులు ఆందోళన చేస్తూ ఛైర్మన్ పోడియంలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో హమీద్ అన్సారీ వారించారు. అయినా వినకపోవడంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది.