: టీమిండియాను హెచ్చరిస్తున్న యువ పేసర్


వరుస పరాజయాలతో ఢీలాపడిన టీమిండియాకు సాధారణ బౌలర్లు సైతం హెచ్చరికలు జారీచేస్తున్నారు. మొన్నటికిమొన్న సఫారీ గడ్డపై ఓటములు ఎదుర్కొన్న ధోనీ సేన పరిస్థితి న్యూజిలాండ్ లో అడుగుపెట్టేసరికి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఒక్క గెలుపుకూ నోచుకోక వన్డే సిరీస్ ను 0-4తో కివీస్ కు సమర్పించుకుంది. రేపటి నుంచి రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుండగా.. కివీస్ యువ పేసర్ ట్రెంట్ బౌల్ట్ భారత శిబిరాన్ని హెచ్చరిస్తున్నాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ ను స్వింగ్ తో కకావికలం చేస్తానని అంటున్నాడు.

'భారత బ్యాట్స్ మెన్ స్వాభావికంగా అటాకింగ్ కు ప్రాధాన్యమిస్తారు. కానీ, స్వింగ్ తో వారి డిఫెన్స్ ను ఛేదించడం పెద్ద కష్టమేమీ కాబోదు. బంతిని వికెట్ కు రెండు వైపులా నాట్యమాడిస్తే సరి' అని వ్యాఖ్యానించాడు. లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి బంతులు విసిరితే ధోనీ అండ్ కో ఒత్తిడికి గురవడం ఖాయమని ఈ కుర్ర బౌలర్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక షార్ట్ పిచ్ బంతులను వ్యూహాత్మకంగా ప్రయోగిస్తామని తెలిపాడు. తొలి టెస్టు రేపటి నుంచి ఆక్లాండ్ లో జరగనున్న నేపథ్యంలో భారత బ్యాట్స్ మెన్ కు మరోసారి పేస్ పరీక్ష తప్పకపోవచ్చని బౌల్ట్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News