: సడక్ బంద్ కు వస్తే అరెస్టే: పోలీసులు


21న హైదరాబాద్ బెంగళూరు 7వ నెంబర్ జాతీయ రహదారిపై తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్ కు అనుమతి లేదని  పోలీసులు స్పష్టం చేశారు. 20 నుంచి 22 ఉదయం వరకూ హైదరాబాద్ బెంగళూరు మార్గంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని మహబూబ్ నగర్ ఎస్పీ నాగేంద్ర కుమార్ తెలిపారు. సడక్ బంద్ కు వచ్చే నేతలను అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ 2300 మందిపై బైండోవర్ కేసులను నమోదు చేశామని తెలిపారు. 

  • Loading...

More Telugu News