: కాసేపట్లో రాజ్ ఘాట్ కు బయల్దేరనున్న సీఎం
పార్టీ హైకమాండ్ ను ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్... కాసేపట్లో ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు బయల్దేరనున్నారు. సీఎంతో పాటు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో వెళ్లనున్నారు. వీరంతా పార్టీ అధిష్ఠానం చేస్తున్న హెచ్చరికలను సైతం లెక్కచేయడం లేదు. రాజ్ ఘాట్ నుంచి జంతర్ మంతర్ చేరుకుని... అక్కడ మౌన దీక్ష చేపడతారు.