: నేడు కోల్ కతాలో మోడీ ర్యాలీ
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యాక దేశవ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొంటున్న నరేంద్రమోడీ.. నేడు తొలిసారిగా పశ్చిమబెంగాల్లో ర్యాలీ నిర్వహించనున్నారు. కోల్ కతాలో మోడీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కానుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన రహస్య ఫైళ్ల అంశాన్ని మోడీ ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. మరోవైపు నరేంద్రమోడీ సభకు పశ్చిమబెంగాల్, కేంద్ర ప్రభుత్వాలు సహకరించడం లేదని బీజేపీ ఆరోపించింది. కోల్ కతాలోని రేస్ కోర్స్ మైదానంలో మోడీ హెలికాప్టర్ దిగడానికి అనుమతివ్వకపోవడంతోపాటు, మోడీ రక్షణ కోసం వస్తున్న ఎన్ఎస్ జీ, గుజరాత్ అధికారులకు ఆహారం, ఇతర వసతుల కల్పనకు కూడా ఎలాంటి సహకారం లేదని బీజేపీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ సిన్హా తెలిపారు.