: కిడ్నీలను కాటేస్తున్న హెర్బల్ ఔషధాలు
హెర్బల్ ఔషధాలను వాడడం వల్ల భారత్ లో లక్షలాదిగా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని బ్రిటిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా భారత్, చైనాలో హెర్బల్ ఔషధాలను వినియోగించడం వల్ల కిడ్నీలు విఫలమవడం, మూత్రాశయ కేన్సర్లకు లోనవుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని లండన్ లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
సన్నబడడానికి, ఆస్తమా, ఆర్థరైటిస్ తదితర సమస్యల నివారణకు వినియోగించే హెర్బల్ ఔషధాలు అరిస్టోలోచిక్ యాసిడ్ తో తయారవుతాయని చెప్పారు. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. తీవ్ర కిడ్నీ వ్యాధులతోపాటు కిడ్నీ కేన్సర్ కు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫ్రొఫెసర్ గ్రాహం లార్డ్ చెప్పారు.
వీటిని అమెరికా సహా పలు దేశాలు నిషేధించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయినప్పటికీ హానికరమైన ఈ ఔషధాలు భారత్, చైనా సహా పలు ఆసియా దేశాలలో విరివిగా లభ్యమవుతున్నాయని, వాడకం కూడా ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. వీటిని నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు.