: నేడు ఢిల్లీలో నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ
భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఢిల్లీ రానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 7.30 గంటలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయనతో భేటీ కానున్నారు. దీంతో తన చెన్నై పర్యటనను చంద్రబాబు రేపటికి వాయిదా వేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆయన రేపు కలవనున్నారు. ఈరోజు ముంబయిలో శివసేన నేత ఉద్ధవ్ థాకరేతో ఆయన భేటీ అవుతారు.