: శివశివా.. మహిళపై బ్రదీనాథ్ ప్రధానార్చకుడి అత్యాచార యత్నం!


ఈ వార్త వింటే సాక్షాత్తూ పరమేశ్వరుడు కూడా ఆగ్రహిస్తాడేమో! ప్రముఖ శైవక్షేత్రం, హిమాలయాల్లో కొలువైన బద్రీనాథ్ ఆలయ ప్రధాన పూజారి కేశవ్ నంబూద్రి ఢిల్లీలోని ఒక హోటల్లో 28 ఏళ్ల వివాహితపై సోమవారం మధ్యాహ్నం అత్యాచారం చేయబోయారు. మహిళ తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

బాధితురాలి తండ్రి కేశవ్ నంబూద్రికి పరిచయం. ఆమె తండ్రికి బద్రీనాథ్ లో ఒక హోటల్ ఉంది. అలా కేశవ్ కు ఆమెతోనూ పరిచయం ఏర్పడింది. కేశవ్ సోమవారం ఆమెకు ఫోన్ చేసి ఢిల్లీలోని ఫలానా హోటల్లో ఉన్నానని, అక్కడకు రావాలని కోరాడు. ఆమె తిరస్కరించింది. ముఖ్యమైన పని ఉందని ఒకటికి రెండు సార్లు కోరడంతో ఆమె హోటల్ కు వెళ్లింది. గదిలో కేశవ్ నంబూద్రితోపాటు, అతడి సహచరుడు విష్ణు ప్రసాద్ కూడా ఉన్నాడు. ఆమె రావడంతోనే విష్ణును బయటకు పంపించేశాడు. అనంతరం కేశవ్ ఆమె వంటిపై చేతులు వేసి అసభ్యంగా వ్యవహరించగా.. ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చేసి, తన కారు డ్రైవరు సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేశవ్ నంబూద్రితోపాటు, అతడి సహచరుడు విష్ణు ప్రసాద్ ను సోమవారమే అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేసిన అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచారు. జడ్జి వారిద్దరికీ ఈ నెల 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో కేశవ్ నంబూద్రిని బద్రీనాథ్ ఆలయ ప్రధానార్చక పదవి నుంచి తొలగించారు. ఆ స్థానంలో ఈశ్వర ప్రసాద్ ప్రధానార్చకుడిగా వ్యవహరిస్తారని ఆలయ కమిటీ చీఫ్ గనేష్ గొడియాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News