: శ్రీలంక తమిళుల అంశంపై రాజ్యసభలో వాయిదాల పర్వం
శ్రీలంక తమిళుల విషయమై రాజ్యసభలో డీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యసభ ఛైర్మన్ ఎంతగా సముదాయించినప్పటికీ డీఎంకే సభ్యులు వినకపోవటంతో సభ వాయిదా అనివార్యమైంది. ఇదే అంశంపై ఉదయం ఒకమారు వాయిదా పడిన సభ ఇదే పరిస్థితి కొనసాగడంతో అనంతరం మళ్లీ మధ్యాహ్నం గం.2 వరకూ వాయిదా పడింది.