: హైకమాండ్ కు లగడపాటి అల్టిమేటం
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ హైకమాండ్ కు అల్టిమేటం ఇచ్చారు. పునర్వ్యస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోమని రేపు ఉదయం 11 గంటలలోపు చెప్పాలని, లేకుంటే పార్లమెంటును ఒక్క క్షణం కూడా నడవనివ్వబోమని హెచ్చరించారు. బిల్లు ప్రవేశపెట్టాలని అధిష్ఠానం భావిస్తే, ఎందుకు ప్రవేశపెట్టామా? అని చింతించాల్సి ఉంటుందని తీవ్రస్వరంతో స్పష్టం చేశారు. బిల్లును ప్రవేశపెడితే కొరివితో తలగోక్కున్నట్టే అని వ్యాఖ్యానించారు. రేపు రాష్ట్రపతిని కలవడంతోపాటు ముఖ్యమంత్రి సహా తామందరం మౌనదీక్ష చేపడతామని లగడపాటి తెలిపారు.