: నాకు ఆసక్తి లేదు... ఆఫర్ వచ్చినా తిరస్కరిస్తా: గ్యారీ కిర్ స్టెన్


ఇంగ్లండ్ క్రికెట్ జట్టు డైరెక్టర్ పదవిని స్వీకరించేందుకు తనకు ఆసక్తి లేదని, ఆఫర్ వచ్చినా తిరస్కరిస్తానని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ తెలిపాడు. తాజా ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర వైఫల్యంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఇంగ్లండ్ క్రికెట్ కమిటీ కొత్త కోచ్ లపై దృష్టి సారించింది. దీంతో గ్యారీకి పదవి లభించవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కిర్ స్టెన్ తన అనాసక్తతను బయటపెట్టాడు.

మరో వైపు ఇంగ్లండ్ ను ముప్పుతిప్పలు పెట్టిన షేన్ వార్న్ తమ జట్టుకు కోచింగ్ ఇస్తే బాగుంటుందని ఇంగ్లాండ్ అభిమానులు సామాజిక నెట్ వర్క్ లో అభిప్రాయపడుతున్నారు. దీనిపై షేన్ వార్న్ స్పందిస్తూ, ఇంగ్లాండ్ అభిమానుల ఆదరాభిమానాలకు కృతజ్ఞుడినని, అవకాశం వస్తే పరిశీలిస్తానని సంసిద్ధత వ్యక్తం చేశాడు. అయితే తన తొలి ప్రాధాన్యం మాత్రం ఆస్ట్రేలియాకేనని వార్న్ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News