: ములాయంతో బాబు భేటీ
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ములాయంకు బాబు వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం కోసం సీమాంధ్రులకు అన్యాయం చేయాల్సిన పని లేదని, ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాల్సిన అవసరం ఉందని బాబు ఆయనకు వివరించారు. దీనికి ఆయన కూడా మద్దతు తెలిపినట్టు సమాచారం.