: సమైక్య నినాదంతో తెలంగాణలో పర్యటిస్తా: జగన్


సమైక్య నినాదంతో త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో 17 సీట్లకు గాను 5 సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకోవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, సమైక్య రాష్ట్రం కోసం పోరాడేవారికే మద్దతిస్తామని తెలిపారు. విభజన బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న జగన్ మీడియాతో మాట్లాడుతూ, అపాయింట్ మెంట్ తీసుకుని జాతీయ స్థాయి నేతలందరినీ కలుస్తామని చెప్పారు. బుధవారం సాయంత్రం ఆరింటికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని తెలిపారు. చరిత్రలో తొలిసారిగా విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించిందని పేర్కొన్నారు. బిల్లుపై కేంద్రం ముందుకు వెళితే తాము పార్లమెంటులో పోడియం వద్దే ఉండి అడ్డుకుంటామని వివరించారు.

  • Loading...

More Telugu News