: ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక ఉద్యోగమూ ఉండదు!
రాజకీయాలపై అమితాసక్తి కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశకలిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే తిరిగి ఉద్యోగంలో చేరే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ వెసులుబాటును రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైతే ఉద్యోగం చేసే వెసులుబాటు ఉండదు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.