: ఎల్లుండి పార్లమెంటులో టీ బిల్లును పెట్టే అవకాశం?
తెలంగాణ బిల్లును ఈ నెల 6న పార్లమెంటులో ప్రవేశ పెట్టే అవకాశముందని తెలుస్తోంది. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవనున్నాయి. ఈ క్రమంలో రెండో రోజే బిల్లును సభల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దని ఇప్పటికే పలువురు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. అయినా తమ విధి ప్రకారం బిల్లును ప్రవేశపెట్టి, తర్వాత ఏం జరుగుతుందో చూడాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.